Posts

ADVANCE WISHES TO MAHASIVARATRI PARVADINAM

Image
ADVANCE WISHES TO MAHASIVARATRI PARVADINAM మహాశివుడు, మొదటి సారిగా బ్రహ్మ విష్ణు దేవులకు అహంకారం అనే మాయ అలుము కొనగా,   దానితో వారు వారి దైవత్వాన్ని కూడా మరచి ( బ్రహ్మ నేను విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాను అనే సత్యాన్ని మరచి ) విష్ణువు పైనే నేనే గొప్ప అనే వాగ్యుద్ధానికి దిగాడు. స్వతహాగా సాత్విక మూర్తి అయిన విష్ణువు అతని మాటల యుద్ధానికి ఏమి తోచని స్థితికి వచ్చిన వాడిలా ఉండిపోయాడు. కానీ బ్రహ్మ తన రాజస ప్రవృత్తిని - పెంచుతూ ఉన్నాడు.  అలాంటి పరిస్తితి లో మహాశివుడు లోకాలను రక్షించ తలచి -- వారి ఎదుట మహా అగ్ని స్వరూప దివ్య లింగాన్ని ధరించి  వారి  యుద్ధానికి అడ్డు పడి -- వారిద్దరూ ఆశ్చర్యము నుండి బయట పడక ముందే - అంతర్వాణి -- మీరు ఎవరు గొప్ప అనే - స్తితిని  వదిలి, నా ఈ రూపము యొక్క అది అంతములు కనుగొనండి. ఎవరు -- ఆది అంతములు కనుగొని ముందుగా తిరిగి వస్తారో వారు గొప్ప వారు అని వారికీ మధ్య వర్తిత్వం వహిస్తారు. విష్ణువు క్రింది వైపుగాను  బ్రహ్మ పై వైపుగాను -- అది అంతములు లేని ఆ దివ్య లింగమును  కొలుచుటకు బయలు దేరారు. .............................ఇవి  మహా శివ అనుగ్రహ భాషణములు